HomeTelanganaNizamabadతండ్రి–బిడ్డను విడదీసిన పాపం ప్రశాంత్‌రెడ్డిదే! బీఆర్‌ఎస్‌లో ఉండి కేసీఆర్‌కు ద్రోహం చేశారు.. అధికారం పోగానే కాంగ్రెస్‌తో...

తండ్రి–బిడ్డను విడదీసిన పాపం ప్రశాంత్‌రెడ్డిదే! బీఆర్‌ఎస్‌లో ఉండి కేసీఆర్‌కు ద్రోహం చేశారు.. అధికారం పోగానే కాంగ్రెస్‌తో మంతనాలు ‘‘మహాభారతంలోని శకుని పాత్ర ఆయనది.. ఇక ప్రశాంత్‌రెడ్డికి ప్రజాజీవితం లేదు’’ ‘‘నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఏకమయ్యారు.. తెలంగాణ రక్షణ సేన అధినేత కవిత తీవ్ర వ్యాఖ్యలు ఇక ఇందూరులో ఐదుకు ఐదు చోట్ల టిఆర్ఎస్ జెండా ఎగరేస్తాం’’‘

కేసీఆర్‌ను తండ్రిగా భావించి ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టినా.. ఆ తండ్రి–బిడ్డను విడదీసిన పాపంలో ప్రధాన పాత్ర ప్రశాంత్‌రెడ్డిదే. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ పక్కన కూర్చున్నారు. అధికారం పోగానే కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు మంతనాలు చేశారు. మహాభారతంలోని శకుని పాత్ర లాంటిదే ఆయనది.

ఇక ఆయనకు ప్రజాజీవితం లేదు.. బాల్కొండ నుంచి పారిపోండి’’ అంటూ తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రక్షణ సేన రాజకీయ పార్టీ ఏర్పాటైన తర్వాత తొలిసారి నిజామాబాద్‌ జిల్లాకు వచ్చిన ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత.. సొంత గడ్డ నుంచే కొత్త రాజకీయ పోరాటానికి శంఖారావం పూరించారు.

ఇందల్వాయి టోల్‌గేట్‌ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఇందల్వాయి మండలం గన్నారంలో తెలంగాణ రక్షణ సేన జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాధవనగర్‌ సాయిబాబా ఆలయం నుంచి భారీ ర్యాలీ ప్రారంభమైంది. పులాంగ్‌ చౌరస్తా, రాజారాజేంద్ర చౌరస్తా, పెద్దబజార్‌, నెహ్రూపార్క్‌, గాంధీచౌక్‌, బస్టాండ్‌ మీదుగా పాత కలెక్టరేట్‌ మైదానానికి ర్యాలీ చేరుకుంది.

అక్కడ నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ’లో కవిత మాట్లాడారు.రాజకీయ పార్టీ ఏర్పాటు తర్వాత తొలిసారిగా నిజామాబాద్‌ జిల్లాకు వచ్చిన ఆమె ‘పాంచజన్య సంకల్ప సభ’లో ప్రసంగించారు. ఈ సందర్భంగా గత బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై, బీజేపీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.‘‘కాళేశ్వరం కోసం లక్ష కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారు.

నిజామాబాద్‌లో ఒక్క ఎకరానికైనా కాళేశ్వరం నీళ్లు వచ్చాయా?’’ అని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీతో ప్రయత్నించినా ఫలితం రాలేదని, ఇప్పుడు కొత్త రాజకీయ శక్తి అవసరమని అన్నారు. ‘‘ఇక ప్రశాంత్‌రెడ్డికి ప్రజాజీవితం లేదు.. బాల్కొండ నుంచి పారిపోండి. మళ్లీ పోటీ చేసినా ఇదే గులాబీ జెండాతో ఓడిస్తాం’’ అని అన్నారు.కేసీఆర్‌ ఓడిపోయిన రెండో రోజే కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రశాంత్‌రెడ్డి ప్రయత్నించారని కవిత ఆరోపించారు.

ముకుంద్‌రెడ్డితో, అనంతరం అమెరికాలో ఉండగా వేం నరేందర్‌రెడ్డితో మాట్లాడుకున్నారని పేర్కొన్నారు. ‘‘బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు తండ్రి–బిడ్డను వేరు చేయడానికి ప్రయత్నించారు. అధికారం పోగానే అధికార పార్టీలోకి వెళ్లేందుకు చూశారు. ఇదే ఆయన నైజం’’ అని విమర్శించారు.

తెలంగాణ వచ్చినాక బాల్కొండ, మోర్తాడ్‌లో ప్రచారానికి వస్తుంటే హెలికాప్టర్‌లో… నేను, కేసీఆర్ , ప్రశాంత్ రెడ్డి ముగ్గురం మా హెలికాప్టర్‌లో ఉన్నాం. “బీడీ కార్మికులకు మీరు పెన్షన్ ఇస్తామని చెప్పండి, ఇబ్బందులలో ఉన్నారని ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే, ఆనాడు కేసీఆర్ ఒప్పుకున్నారు, బీడీలకు పెన్షన్ వచ్చింది.

మరి ఇయ్యాల ఈ 10 ఏండ్లల్ల ఒక్క రూపాయి అయినా బీడీలకు పెన్షన్ పెరిగిందా? ఒక్కరికైనా ఎక్కువ బీడీ కార్మికులకు యాడ్ అయిందా? కట్ ఆఫ్ కోసం కొట్లాడుతూనే ఉన్నాం, 12 ఏండ్లు అయింది, ఇంకొక్కరికైనా పెరిగిందా అని ప్రశ్నించారు. ఎంపీగా కొట్లాడి ఒప్పించుకొని తెచ్చుకున్నాం పెన్షన్ అని గుర్తు చేశారు.

రాజకీయం చేయాలంటే నేను ఎండ్లకైనా పోవొచ్చు, ఏ పార్టీలకైనా పోవొచ్చు. మీ దయతోని ఆల్రెడీ ఎంపీ అయినా, మీ దయతోని ఆల్రెడీ ఎమ్మెల్సీ అయినా. కొత్తగా అయ్యేదేం లేదు, కొత్తగా చూసేదేం లేదు. కానీ ఒక పంతం పట్టుకున్నా.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్కటైనా హామీ నెరవేర్చరా అని ప్రశ్నించారు.నేటికీ 999వ రోజట కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి.

మరి ఈ 999 రోజులల్ల, ఈ 1,000 రోజుల పరిపాలనలల్ల ఒక్కటంటే ఒక్క హామీ కూడా చేయలే. ఏం చేసిర్రు ఒక్కటంటే ఒక్కటి? ఉచిత బస్సు పెట్టి, మనలో మనకే ఆడోళ్లకు గొడవలు పెడుతున్నారు అని దుయ్యబట్టారు.

నేను జాగృతి జనం బాట పెట్టినప్పుడు బోధన్ పోయాము అక్కడ వరదలొచ్చి మొత్తం మునిగిపోతే, అక్కడ ఇప్పటివరకు కూడా కనీసం నష్టపరిహారం రాలేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక్కసారి ఉద్యమం చేసిండా ఒక్కసారి ధర్నా వేసిండా నిజామాబాద్ రూరల్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూర్ జీవన్ రెడ్డి, బాల్కొండ ప్రశాంత్ రెడ్డి ఎప్పుడైనా ధర్నా వేసిండా ఒక్కసారి ఆలోచన చేయాలని కోరారు.

‘‘ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బోధన్‌ ఎమ్మెల్యే.. అందరినీ గెలిపించేందుకు నేను కష్టపడ్డాను. నాకు చికెన్‌గున్యా వచ్చి కీళ్ల నొప్పులతో బాధపడుతున్నా తిరిగాను. చివరకు అందరూ కలిసి నన్ను ఓడించారు. కానీ ఓటమిని నేను అంగీకరించను. ప్రజల విజయం కోసం పోరాడుతాను’’ అని కవిత అన్నారు.

‘‘తెలంగాణ ఉద్యమంలో రక్తం మరిగించి గులాబీ జెండాను నిజామాబాద్‌లో నిలబెట్టింది మేమే అనిగుర్తుచేశారు. కానీ ఈ నిజామాబాద్‌లో ఐదుకు ఐదు చోట్ల టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాం. అలాగే రాబోయే జెడ్పీటీసీ, ప్రతి ఎంపీటీసీ స్థానంలో పోటీ చేస్తాం. కొత్త జెండాతో కొత్త చరిత్ర రాస్తాం’’ అని ఆమె ప్రకటించారు.

పసుపు బోర్డు తెచ్చామని చెప్పుకోవడం దేనికి?బీజేపీ ఎంపీ అరవింద్‌ ధర్మపురిపై కూడా కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఎంపి గా గెలిచి 7 సంవత్సరం ఏం చేశావు అని ఆమె నిలదీసింది నేను ఎంపీగా ఉన్నప్పుడు మాదాపూర్ నగర్ బ్రిడ్జి కోసం కే టాక్స్ లు వసూలు చేశానని ఆరోపణ చేసిన అరవింద్ ఇప్పుడు ఏ టాక్స్ లతో చేస్తున్నారని ప్రశ్నించారు ఎందుకు పనులు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు.

‘‘పసుపు బోర్డు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. దానివల్ల పసుపు రైతులకు ఏం లాభం జరిగింది? ఈ ఏడాది ధర పెరిగింది. అది సహజంగా పెరిగిందే తప్ప బీజేపీ వల్ల కాదు. పసుపు రైతులకు న్యాయం జరిగేలా మార్కెట్‌లో వ్యాపారుల గుత్తాధిపత్యాన్ని అడ్డుకోవాలి’’ అన్నారు.

*పాంచజన్యంలో ఐదు సంకల్పాలు*

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఐదు ప్రధాన కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామని కవిత తెలిపారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, యువతకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు ప్రభుత్వ రుణాలు, సామాజిక న్యాయం, రైతుకు గౌరవం ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు.‘‘ప్రైవేటు పాఠశాలలో చదివినా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పిల్లలకు ఉచిత విద్య అందిస్తాం.

ఎంత పెద్ద వ్యాధి అయినా తెలంగాణలోని ఏ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందినా ఉచిత వైద్యం అందేలా చేస్తాం’’ అని హామీ ఇచ్చారు.చదువుకున్న యువత వ్యాపారాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం ముందుండి రుణాలు ఇవ్వాలని ప్రతిపాదించారు.

‘‘బ్యాంకుల చుట్టూ తిరిగి రుణం కోసం యువత ఇబ్బంది పడకూడదు. రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు ప్రభుత్వమే రుణ సాయం అందించే విధానం తీసుకురావాలి’’ అన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments