HomeCRIME180 కేసుల నిందితుడే.. హత్యకు సూత్రధారి! ...పగతో కక్ష.. పెప్పర్‌ స్ప్రేతో దాడి.. కత్తులతో పొడిచి...

180 కేసుల నిందితుడే.. హత్యకు సూత్రధారి! …పగతో కక్ష.. పెప్పర్‌ స్ప్రేతో దాడి.. కత్తులతో పొడిచి హతమార్చారు..

మృతుడి హత్యకు తమ్ముడి మరణమే కారణమని నిందితుడి వెల్లడి

ఆరంగఢ్‌ వద్ద ముగ్గురి అరెస్టు.. ఆయుధాలు, మొబైల్‌ స్వాధీనం

మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ నెల 2న జరిగిన మహమ్మద్‌ అబ్దుల్‌ రవూఫ్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షల నేపథ్యంలో పథకం ప్రకారం హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రధాన నిందితుడు మహమ్మద్‌ జావీద్‌ అలియాస్‌ హెక్లా జావీద్‌తో పాటు అతని సహచరులు మహమ్మద్‌ అబ్దుల్లా, షేక్‌ ఆరిఫ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు జావీద్‌పై హైదరాబాద్‌, పరిసర జిల్లాలు, కర్ణాటకలో 180 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు మహమ్మద్‌ ఆరిఫ్‌పై మూడు, మహమ్మద్‌ అబ్దుల్లాపై ఒక కేసు ఉన్నట్లు రాజేంద్రనగర్‌ డీసీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు. రాజేంద్రనగర్‌ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్‌ అబ్దుల్‌ రవూఫ్‌ తన తమ్ముడు సాజిద్‌ కర్ణాటకలో 2024 మే 19న మృతిచెందిన ఘటనలో ప్రమేయం ఉందని జావీద్‌ అనుమానించాడు. దీంతో రవూఫ్‌పై కక్ష పెంచుకున్నాడు. అంతేకాకుండా రవూఫ్‌ తనను, తన అనుచరులను బెదిరిస్తూ ఎగతాళి చేసేవాడని జావీద్‌ పోలీసుల విచారణలో చెప్పినట్లు అధికారులు తెలిపారు. దీంతో రవూఫ్‌ను హతమార్చాలని ముగ్గురూ నిర్ణయించుకున్నట్లు వెల్లడైంది. పథకం ప్రకారం సెప్టెంబర్‌ 2న రాత్రి సుమారు 11 గంటల సమయంలో రవూఫ్‌ ఆటోలో వెళ్తుండగా ముగ్గురు నిందితులు అడ్డగించారు. ముందుగా అతడిపై పెప్పర్‌ స్ప్రే చల్లారు. అనంతరం కత్తులతో దాడి చేసి పలుచోట్ల పొడిచారు. తీవ్ర గాయాలపాలైన రవూఫ్‌ అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. హత్యకు ఉపయోగించిన కత్తులు, రక్తపు మరకలున్న దుస్తులు, పెప్పర్‌ స్ప్రే బాటిళ్లను పల్లె చెరువు సమీపంలోని పొదల్లో పడేసి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సెప్టెంబర్‌ 4న ఉదయం సుమారు 6 గంటలకు ఆరంగఢ్‌ సమీపంలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని బసవకల్యాణ్‌ వైపు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వారిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడు మహమ్మద్‌ జావీద్‌ వద్ద నుంచి మృతుడు అబ్దుల్‌ రవూఫ్‌కు చెందిన మొబైల్‌ఫోన్‌, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు హత్య అనంతరం ఆయుధాలు, ఇతర సామగ్రిని ఎక్కడ పడేశారో కూడా పోలీసులకు వివరించినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో ప్రధాన నిందితుడు మహమ్మద్‌ జావీద్‌ అలియాస్‌ హెక్లా జావీద్‌ నేరచరిత్ర కూడా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌, పరిసర జిల్లాలు, కర్ణాటకలో అతనిపై 180 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మహమ్మద్‌ ఆరిఫ్‌పై మూడు కేసులు, మహమ్మద్‌ అబ్దుల్లాపై ఒక కేసు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments