HomeLaw and Orderమళ్ళీ మొదలైన యాప్ లొల్లి ..ఇందల్వాయి, గన్నారంలో రైతుల ఆందోళన.. తహసీల్దార్ కార్యాలయం ముట్టడి

మళ్ళీ మొదలైన యాప్ లొల్లి ..ఇందల్వాయి, గన్నారంలో రైతుల ఆందోళన.. తహసీల్దార్ కార్యాలయం ముట్టడి

రైతులకు మళ్ళీ యాప్ కష్టాలు మొదలయ్యాయి యూరియా పంపిణీకి అమలు చేస్తున్న యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, రైతుల భూమి విస్తీర్ణం ఆధారంగా ఎకరాకు నిర్ణీత పరిమాణంలో మాన్యువల్ విధానంలో యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు శుక్రవారం ఆందోళన చేపట్టారు.

ఇందల్వాయి గన్నారం గ్రామాల్లో వ్యవసాయ సహకార సంఘం భవనం ఎదుట ధర్నా నిర్వహించడంతోపాటు, గన్నారం గ్రామంలోనూ నిరసన వ్యక్తం చేశారు.ఇందల్వాయి సొసైటీ భవనం ఎదుట రైతులు బైఠాయించి . యాప్ ద్వారా యూరియా పొందేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రతి రైతుకు ఎకరాకు నిర్ణీత సంఖ్యలో సంచులు కేటాయించి సకాలంలో పంపిణీ చేయాలని కోరారు.మరోవైపు గన్నారం సొసైటీ భవనం ఎదుట కూడా రైతులు ధర్నా చేసారు .

అనంతరం గన్నారం గ్రామ ముఖద్వారం కమాన్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడి నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగల్వాయి హెడ్‌కోటర్ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయం వరకు నడుచుకుంటూ వెళ్లి ముట్టడించారు.

రైతులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏఓ శ్రీకాంత్‌కు అందజేశారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. యూరియా కొరత లేకుండా సకాలంలో పంపిణీ చేయాలని రైతులు కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments