ప్రేమించిన యువతికి ఐఫోన్ గిఫ్ట్ గా ఇచ్చేందుకు ఓ యువకుడు గంజాయి స్మగ్లర్ గా మారాడు. చివరికి ప్రేయసి తో కల్సి జైలు పాలయ్యాడు. పెద్దపల్లి జిల్లాకు చెందిన మిత్ర చైతన్య (21), హేమలత (20) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
హేమలత పుట్టినరోజున ఆమెకు యాపిల్ ఐఫోన్ కొనివ్వాలని చైతన్య ప్లాన్ చేసాడు . ఫోన్ కొనుగోలు చేసేందుకు అవసరమైన డబ్బును సమకూర్చుకునేందుకు గంజాయి రవాణా చేయాలనుకున్నాడు
తన ప్రియురాలితో కలిసి మిత్ర చైతన్య ఒడిశాలోని పడుపుల ప్రాంతానికి వెళ్లారు.
ఇద్దరూ కలిసి అక్కడ సుమారు ఐదు రోజులపాటు మకాం వేసారు గంజాయి సరఫరాదారు భగవాన్ హంతాల్ వద్ద రూ.16 వేలకే 12 కిలోల గంజాయి కొనుగోలు చేశారు.
దాన్ని హైదరాబాద్‌కు తరలించి శశి, నాగూర్ అనే వ్యక్తులకు సుమారు రూ.6 లక్షలకు విక్రయించడానికి ప్లాన్ చేశారు అక్కడి నుంచి గంజాయిని బైక్‌పై పెట్టుకుని హైదరాబాద్‌కు బయలుదేరారు .ఖమ్మం జిల్లా వైరా క్రాస్‌రోడ్డు వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. ఈగల్ ఫోర్స్ వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు .
పోలీసులను గమనించిన వెంటనే వారు బైక్ వేగాన్ని పెంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన ఎస్సై వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో ఎస్సై రామారావుతో పాటు చైతన్య, హేమలత స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద ఉన్న సంచులను తనిఖీ చేయగా 12 కిలోల ఎండు గంజాయి బయటపడింది. దీంతో గంజాయితో పాటు వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం, నాలుగు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మిత్ర చైతన్యకు ఇప్పటికే నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
పెద్దపల్లి, ఉప్పల్, మేడ్చల్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో గంజాయి రవాణాకు సంబంధించిన మూడు ఎన్‌డీపీఎస్ కేసులు అతనిపై ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న జైలు నుంచి బెయిల్‌పై విడుదలైనప్పటికీ.. మళ్లీ గంజాయి రవాణాకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు కానీ ఈసారి ప్రియురాలు కోసం గంజాయి రవాణా చేసి పోలీసులకు చిక్కాడు
