న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకునేందుకు ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య కోరారు.
చిన్నచిన్న కేసులు, ట్రాఫిక్ చలానాలు, స్వల్ప నేరాలకు సంబంధించిన కేసులు, సివిల్ వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు.లోక్ అదాలత్ ద్వారా ఇరుపక్షాల అంగీకారంతో వివాదాలకు శాంతియుత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
న్యాయస్థానాల్లో కొనసాగుతున్న కేసులను సుదీర్ఘ ప్రక్రియ లేకుండా త్వరగా ముగించుకునేందుకు ఇది మంచి అవకాశమని సీపీ సూచించారు. పెండింగ్ కేసులు ఉన్న కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
