రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా బాసర బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాంచ రైల్వే దాటిన తర్వాత బాసర బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని సుమారు 60 నుంచి 65 సంవత్సరాల వృద్ధుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
స్థానికుల సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
