గణేష్ నిమజ్జనం సందర్భంగా బాసర బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు , భద్రతా ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య శనివారం పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా నిమజ్జనానికి తరలివచ్చే గణేష్ విగ్రహాలు, భక్తులు మరియు వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చేపట్టిన ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పరిశీలించారు. పోలీస్ సిబ్బందికి అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ , భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
అలాగే నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా , సురక్షితంగా జరిగేలా అధికారులు మరియు సిబ్బందికి అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
