HomeDevotionalసా ....గుతున్న గణనాథుడి వీడ్కోలు......రాత్రంతా రోడ్ల మీదే గణనాధుడి జాగరణ ..........శనివారం సాయంత్రదాక సాగె అవకాశం...

సా ….గుతున్న గణనాథుడి వీడ్కోలు……రాత్రంతా రోడ్ల మీదే గణనాధుడి జాగరణ ……….శనివారం సాయంత్రదాక సాగె అవకాశం ……..సహనం సాగిన పోలీసు బందోబస్తు ………

పదకొండు రోజుల పాటు కొలువుదీరిన గణనాథుడి కి గంగమ్మ ఒడికి చేరడానికి గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. భక్తిశ్రద్ధలతో భక్తుల కోలాహల మధ్య శుక్రవారం రాత్రి నిమజ్జనం కోసం వాహనం మీదికి చేరిన ఆ లంబోదరుడు.

రాత్రంతా రోడ్ల మీదే జాగరణ చేసారు.అవునూ ఈసారి అత్యంత పటిష్టమైన బందోబస్తు మధ్య శుక్రవారం రాత్రి నిమజ్జనం సాగింది పోలీసులు బందోబస్తు విధుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు అత్యంత సహనం తో వ్యవహరించారు.

గణనాధులను తరలించే విషయంలో భక్తుల ను పరుగులు పెట్టించలేదు అదే అలుసుగా భావించిన యువ భక్తులు గంటల తరబడిగా రోడ్ల మీద చిందులు వేస్తూ కాలయాపన చేశారు అందుకే శుక్రవారం సాయంత్రం మొదలైన నిమజ్జన యాత్ర శనివారం మధ్యాహ్నం దాక సాగింది పట్ట పగలు నగర విధుల్లో నిమజ్జన సంబరాలు సాగాయి.. గణేశ్‌ విగ్రహాల శోభాయాత్రలు సాగుతున్న ఆయా ప్రాంతాల్లో శనివారం కూడా ట్రాఫిక్ చిక్కులు తప్పలేదు.

భక్తుల ఆదరణ లేక పోయిన ఆయా మండలల నిర్వహులకే రోడ్ల భారీ చప్పుళ్ల . డప్పులు, బ్యాండ్‌ మేళాలు,నానా హంగామా చేస్తూ ముందుకు కదలడానికే మొరాయించారు.దీనితో పోలీసులు సైతం నిస్సహాయులుగా ఉండిపోయారు కానీ శనివారం తెల్లవారు నుంచి మధ్యాహ్నం దాక ప్రధాన రోడ్ల మీద యధావిధిగా నిన్నటి హడావుడి వుండడం తో రోడ్ల మీద రాకపోకలు సాగించడం కష్టంగా ఉండే మధ్యాహ్నం తర్వాత పోలీసులు కాస్త కఠినంగా వ్యవహరించడంతో వాహనాలు ముందుకు కదిలాయి.

నిన్నటి లగే యువ భక్తులు రోడ్ల మీద చెలరేగారు సాధారణ ప్రజల కు అసౌకర్య కలిగించారు. నగరంలో పెద్దబజార్ సమీపంలో తెల్లవారు జామున ఓ భారీ గణనాధుడి విగ్రహం నిమజ్జనం కోసం వెళ్లే వాహనం తో పాటు ఓ ప్రార్థన మందిరం వద్ద వదిలేసి మండలి నిర్వాహుకులు పత్తాలేకుండా పోయారు.

ఉదయం ఎనిమిది గంటలైనా వారు రాకపోవడంతో స్థానిక బిట్ పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు దీనితో ఏసీపీ ప్రకాష్ యాదవ్ హుటాహుటిన బలగాలతో వచ్చారు కానీ వాహనం డ్రైవర్ తో సహా అక్కడ ఎవరు లేక పోవడంతో వారుకూడా కొద్దీ సేపు కంగారు పడ్డారు పెద్దబజార్ అజమ్ రోడ్ మధ్య వాహనాల రాకపోకలు సైతం ఇబ్బంది కలిగింది చివరికి నిర్వాహుకులను గద్దించడంతో భారీ విగ్రహం ఉన్న ఆ వాహనం ముందుకు కదిలింది దీనితో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments