HomeTelanganaNizamabadబీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలికాంగ్రెస్‌ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తాం: బొబ్బిలి...

బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలికాంగ్రెస్‌ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తాం: బొబ్బిలి రామకృష్ణ

కాంగ్రెస్‌ నాయకులపై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని నగర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ హెచ్చరించారు. ఇండియా కూటమి పార్టీల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

జ్ఞానేశ్‌కుమార్‌ను సమర్థిస్తూ నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ కులాచారి ఇటీవల కాంగ్రెస్‌ నాయకులను కుక్కలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

‘‘కాంగ్రెస్‌ నాయకులు దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఓటు హక్కును కాపాడే కాపలా కుక్కల్లా పనిచేస్తారు. ప్రజల పట్ల విశ్వాసం, నమ్మకంతో ఉంటాం’’ అని అన్నారు. కాంగ్రెస్‌ నేతలపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. అధికారం కోసం పార్టీలు మారే సంస్కృతి కాంగ్రెస్‌కు లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడే విధానం తమది కాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడిని ఉద్దేశించి విమర్శించారు.

ప్రజలకు అన్యాయం జరిగితే బీజేపీ నేతలపై రాజకీయంగా పోరాటం చేస్తామని, అవసరమైతే వారి ఇళ్లను ముట్టడించే స్థాయిలో ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.

దినేశ్‌ కులాచారి తన స్థాయిని గుర్తించి మాట్లాడాలని, అహంకారపూరిత వ్యాఖ్యలు మానుకోవాలని బొబ్బిలి రామకృష్ణ హితవు పలికారు. కాంగ్రెస్‌ నాయకులపై వ్యక్తిగత దూషణలకు దిగితే తగిన రీతిలో సమాధానం చెబుతామని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments