HomeTelanganaNizamabadరెడ్‌క్రాస్‌ సేవలు విస్తరించాలికార్యవర్గ సభ్యుడు జగన్మోహన్‌గౌడ్‌కు బార్‌ అసోసియేషన్‌ సన్మానం

రెడ్‌క్రాస్‌ సేవలు విస్తరించాలికార్యవర్గ సభ్యుడు జగన్మోహన్‌గౌడ్‌కు బార్‌ అసోసియేషన్‌ సన్మానం

ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ నిజామాబాద్‌ జిల్లా శాఖను మరింత అభివృద్ధి చేసి, ప్రజలకు రక్తదానం, సామాజిక సేవలను విస్తృతంగా అందించాలని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నీలకంఠరావు కోరారు. ఇటీవల రెడ్‌క్రాస్‌ జిల్లా శాఖ మేనేజింగ్‌ కమిటీ ఎన్నికల్లో కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైన న్యాయవాది మల్లెపూలు జగన్మోహన్‌గౌడ్‌ను నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం సన్మానించారు.

ఈ సందర్భంగా నీలకంఠరావు మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్‌ సేవలను జిల్లా వ్యాప్తంగా మరింత విస్తరించేందుకు కృషి చేయాలని జగన్మోహన్‌గౌడ్‌కు సూచించారు. ముఖ్యంగా రక్తదాన కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు అవసరమైన వారికి సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు.

కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది అందాల సుదర్శన్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పి.రాజేశ్వర్‌రెడ్డి, చీఫ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ రాజ్‌కుమార్‌, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సోమలింగగౌడ్‌, న్యాయవాదులు కేశవరావు, పడిగేల వెంకటేశ్వర్‌, ఆల్గోట వరవీందర్‌, మెట్టు నరేష్‌, పులి జైపాల్‌, నారాయణదాస్‌, వసంతరావు, రోహన్‌, జయప్రకాశ్‌ లోహియా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments