HomeTelanganaNizamabad25 ఏళ్ల ప్రజాజీవితం.. దేశాభివృద్ధే లక్ష్యం..మోదీ పాలనలో దేశ రూపురేఖల్లో మార్పు..తెలంగాణలోనూ డబుల్‌ ఇంజిన్‌ సర్కారు...

25 ఏళ్ల ప్రజాజీవితం.. దేశాభివృద్ధే లక్ష్యం..మోదీ పాలనలో దేశ రూపురేఖల్లో మార్పు..తెలంగాణలోనూ డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలి..బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ కులాచారి, పసుపు బోర్డు ఛైర్మన్‌ పల్లె గంగారెడ్డి

25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా దేశాభివృద్ధి, ప్రజాసేవకే అంకితమైన నాయకుడు నరేంద్ర మోదీ అని బీజేపీ నేతలు పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని తెలిపారు.

మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ కులాచారి ఆధ్వర్యంలో నగరంలోని వ్యవసాయ మార్కెట్‌లో ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప సభ’, ‘సేవా జ్యోతి యాత్ర’ నిర్వహించారు.

ఈ సందర్భంగా దినేశ్‌ కులాచారి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్ల పాటు కీలక పదవుల్లో ఉన్నప్పటికీ మోదీ తనకంటూ ప్రత్యేకంగా ఆస్తులు కూడబెట్టుకోలేదన్నారు. దేశ ప్రజలనే కుటుంబంగా భావిస్తూ పనిచేస్తున్నారని చెప్పారు.

పేదల కోసం దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టడంతోపాటు ఉచిత బియ్యం, గ్యాస్‌ సిలిండర్లు, మరుగుదొడ్లు వంటి పథకాలను అమలు చేశారని వివరించారు. ‘బేటీ బచావో.. బేటీ పడావో’ ద్వారా బాలికల విద్యకు ప్రాధాన్యమిచ్చారని తెలిపారు.దేశంలో రహదారులు, రైల్వేలు, మౌలిక వసతుల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.

గత ప్రభుత్వాల పాలనలో జరిగిన అవినీతిపై ఆయా నేతలే ఆరోపణలు చేసుకున్నారని, అయితే మోదీపై ఒక్క రూపాయి అవినీతి ఆరోపణనైనా నిరూపించే దమ్ము ప్రత్యర్థులకు ఉందా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇళ్లు మంజూరు చేస్తుంటే, తెలంగాణలో వాటికి ఇందిరమ్మ ఇళ్లుగా పేర్లు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చే తాత్కాలిక హామీలకు మోదీ రాజకీయాలు భిన్నమని, దేశ భవిష్యత్తు, భావితరాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పనిచేస్తున్నారని అన్నారు. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చి డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఏర్పడేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.


పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. 2014లో మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో అనేక రంగాల్లో మార్పు వచ్చిందన్నారు. 2014కు ముందు, ప్రస్తుతం దేశ పరిస్థితులను ప్రజలు పోల్చి చూడాలని సూచించారు. మోదీ సెలవులు, వ్యక్తిగత సౌకర్యాలను పట్టించుకోకుండా దేశాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు.

స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం కేవలం ప్రచారానికే పరిమితం కాలేదని, గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. నిజామాబాద్‌లోనూ గతంలో రోడ్ల పరిస్థితి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిశీలిస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు.

జన్‌ధన్‌ ఖాతాల ద్వారా బ్యాంకింగ్‌ వ్యవస్థకు దూరంగా ఉన్న పేదలను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొచ్చారని తెలిపారు. కోట్లాది మందికి ఉచిత రేషన్‌ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ భద్రత విషయంలోనూ మోదీ ప్రభుత్వం రాజీపడటం లేదన్నారు.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తోందని చెప్పారు. విదేశీ ప్రేరణతో దేశంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నించే శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గంగారెడ్డి సూచించారు.

దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మోదీ చేస్తున్న కృషికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments