HomeDevotionalకలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు...గౌరీమాతకు పూజలు నిర్వహించిన కలెక్టర్

కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు…గౌరీమాతకు పూజలు నిర్వహించిన కలెక్టర్

బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో టీఎన్జీఓ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.

ఆయా శాఖల మహిళా ఉద్యోగినులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఈ ఉత్సవంలో భాగస్వాములయ్యారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ భుజంగరావు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని గౌరీమాతకు, రంగురంగుల పూలతో ఆకట్టుకునే రీతిలో ముస్తాబు చేసిన బతుకమ్మలకు సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు.

వివిధ శాఖల ఆధ్వర్యంలో అందంగా అలంకరించిన బతుకమ్మలు కనువిందు చేస్తూ, పూల పండుగ ప్రాధాన్యతను చాటాయి. బతుకమ్మ గేయాలను ఆలపిస్తూ మహిళా ఉద్యోగులు, యువతులు, మహిళలు లయబద్ధంగా బతుకమ్మ ఆటలాడుతూ ఎంతో ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. దాండియా, కోలాటాలతో బతుకమ్మ సంబురానికి వన్నె చేకూర్చారు.

ఈ సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సందడి వాతావరణం నెలకొంది. కార్యాలయ పనివేళలు ముగిసినప్పటికీ ఉద్యోగినులు ఎవరూ ఇళ్లకు వెళ్లకుండా ఎంతో హుషారుగా ఈ ఉత్సవంలో పాల్గొని బతుకమ్మ వేడుక ఔన్నత్యాన్ని చాటారు. ఉత్తమ అలంకరణతో కూడిన బతుకమ్మలను ఎంపిక చేసి, బహుమతులు అందజేశారు.


ఈ ఉత్సవాల్లో టీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు సుమన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments