HomeCRIMEఖిల్లా రోడ్డులో భూ కబ్జాపై కలెక్టర్‌ సీరియస్‌.. కలెక్టర్‌ ఆదేశాలతో రంగంలోకి రెవెన్యూ యంత్రాంగ ప్రభుత్వ...

ఖిల్లా రోడ్డులో భూ కబ్జాపై కలెక్టర్‌ సీరియస్‌.. కలెక్టర్‌ ఆదేశాలతో రంగంలోకి రెవెన్యూ యంత్రాంగ ప్రభుత్వ స్థలంలో రేకుల కంచె తొలగింపు ‘ఇది సంగతి’ కథనంతో స్పందన

నగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. రాత్రికి రాత్రే సరిహద్దులు మార్చేస్తూ, రేకులు చుట్టి తమదేనంటూ జెండాలు పాతేసే కబ్జాదారుల ఆటలకు కలెక్టర్ చెక్ పెట్టారు. అత్యంత విలువైన ఖిల్లా రోడ్డులోని భూమిపై కన్నేసి, అక్రమంగా కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని కలెక్టర్ ఆదేశాల మేరకు కూల్చివేశారు.

నిజామాబాద్ నగర పరిధిలోని ఖిల్లా రోడ్డులో గల సర్వే నంబర్ 25/45 లో ఉన్న సుమారు రెండు ఎకరాల విలువైన ఓపెన్ ల్యాండ్‌పై కొందరు అక్రమార్కుల కన్ను పడింది. ఎవరికీ అనుమానం రాకుండా, ఇండ్లు కట్టకుండా కేవలం స్థలాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి చుట్టూ రేకులతో కాంపౌండ్ వాల్ నిర్మించి కబ్జాకు పాల్పడ్డారు.ఈ భారీ ఆక్రమణ పర్వంపై ‘ఇది సంగతి’ పత్రిక గతంలోనే కథనాన్ని ప్రచురించింది.

ఈ కథనం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించడమే కాకుండా జిల్లా పాలనా యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది.‘ఇది సంగతి’ కథనాన్ని సీరియస్‌గా పరిగణించిన జిల్లా కలెక్టర్, వెంటనే విచారణకు ఆదేశించారు.

నగరంలో నడిబొడ్డున ఉన్న రూ. కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ రెవెన్యూ, మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆక్రమణలను తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ ఖరాకండిగా ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ కఠిన ఆదేశాలతో గురువారం ఉదయం ఎంఆర్ఓ శ్రీధర్ నేతృత్వంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది భారీ బందోబస్తు మధ్య కిల్లా రోడ్డులోని సర్వే నంబర్ 2545 వద్దకు చేరుకున్నారు.

కబ్జాదారులు అక్రమంగా ఏర్పాటు చేసిన రేకుల కాంపౌండ్ వాల్‌ను జేసీబీల సహాయంతో క్షణాల్లో కూల్చివేశారు. ఆక్రమణదారుల నుంచి స్థలాన్ని రక్షించి తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

ఎంఆర్ఓ శ్రీధర్‌, అదనపు ఎంఆర్ఓ సుధీర్‌, ఆర్‌ఐ షఫీ పెరో, టీపీఓ ప్రదీప్‌, రాజేశ్‌, మున్సిపల్‌ శాఖకు చెందిన మంజునాథ్‌, ఏఎస్ఐ లక్ష్మణ్‌ నాయక్‌, గణేశ్‌ తదితరులు కూల్చివేత చర్యల్లో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments