HomeTelanganaNizamabadరైతుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలంసాగునీరు, విద్యుత్‌ అందించాలి.. పంట నష్టానికి పరిహారం చెల్లించాలి..అర్బన్‌...

రైతుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలంసాగునీరు, విద్యుత్‌ అందించాలి.. పంట నష్టానికి పరిహారం చెల్లించాలి..అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే, బిగాల గణేశ్‌ గుప్తా

రాష్ట్రంలో రైతులు సాగునీరు, విద్యుత్‌, యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే, బిగాల గణేశ్‌ గుప్తా విమర్శించారు. పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

సమీక్షలు, అధికారులపై చర్యల హెచ్చరికలతో సమస్యలు పరిష్కారం కావని, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.రైతులకు సమయానికి పంట పెట్టుబడి సాయం అందడం లేదని, యూరియా కొరతతో పాటు విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు వ్యవసాయాన్ని దెబ్బతీస్తున్నాయని తెలిపారు.

జలవిద్యుత్‌, థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని సమర్థంగా వినియోగించుకుని వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావాన్ని కారణంగా చూపడం, అధికారులను బాధ్యులను చేస్తూ సస్పెన్షన్ల హెచ్చరికలు చేయడం వల్ల రైతుల సమస్యలు పరిష్కారం కావని పేర్కొన్నారు.

దేశ ఆహార భద్రతలో తెలంగాణ రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వరి ధాన్యం ఉత్పత్తి, బియ్యం సరఫరాలో రాష్ట్ర రైతాంగం గణనీయమైన భాగస్వామ్యం అందిస్తోందని గుర్తుచేశారు. అలాంటి రైతుల పంటలు ఎండిపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ ఆహార భద్రతపైనా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తూనే రైతుల సమస్యలను విస్మరించకూడదన్నారు.

పంటలు ఎండిపోకుండా అవసరమైన ప్రాంతాలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని, వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. పంట పెట్టుబడి సాయాన్ని సకాలంలో చెల్లించడంతో పాటు యూరియాను కొరత లేకుండా సరఫరా చేయాలన్నారు.

నీరు, విద్యుత్‌ కొరతతో పంటలు దెబ్బతిన్న రైతుల నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని కోరారు. విద్యుత్‌ సమస్యలతో మోటార్లు కాలిపోయినా, బోర్లు దెబ్బతిన్నా మరమ్మతులకు ఆర్థిక సహాయం చేయాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహాలకు కూడా అంతరాయాలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని పేర్కొన్నారు.

రైతుల సమస్యలను రాజకీయ కోణంలో చూడకుండా వ్యవసాయాన్ని కాపాడటమే ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా గుర్తించాలని బిగాల గణేశ్‌ గుప్తా కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణమే స్పందించి రైతులకు ఉపశమనం కలిగించాలని, వారి సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీఆర్‌ఎస్‌ రైతుల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments