HomeLaw and Orderహమ్మయ్య వన్ వే ఎత్తేసారు .....పండగ రద్దీ ఒత్తిడి తో వెనక్కి తగ్గిన పోలీసులు....

హమ్మయ్య వన్ వే ఎత్తేసారు …..పండగ రద్దీ ఒత్తిడి తో వెనక్కి తగ్గిన పోలీసులు….

అసలే ఇరుకైన రోడ్ల తో సాధారణ రోజుల్లోనే రాకపోకలు కష్టంగా ఉండే నగరంలో పండగ రోజుల్లో రద్దీ ఎక్కువగా వుంటుంది. అందులోనూ దసరా పండగ రద్దీ తో నగర రోడ్లు కిక్కరిసి పొతాయి.

ఈ నేపథ్యంలో నిజామాబాద్‌ నగరంలోని కంటేశ్వర్‌ రైల్వే అండర్‌పాస్‌ విస్తరణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు నగరంలో ప్రధాన ప్రాంతాల్లో వన్‌వే ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు అదికూడా ఒక్కరోజే కొద్దీ గంటలే. కానీ వన్ వే ట్రాఫిక్ తో నగర ప్రజానీకం ఉక్కరి బిక్కిరి అయ్యారు.

దసరా పండుగ కోసం దూర ప్రాంతాల నుంచి తమ సొంత ఊరికి రావడం ఆనవాయితీ! అందుకే సాధారణ రోజుల కన్న ఈ పండగ సీజన్ లో ట్రాఫిక్ రద్దీ రెండింతలు వుంటుంది అందుకు తగ్గట్టుగానే ట్రాఫిక్ పోలీసులు కార్యచరణ అమలు చేస్తారు. కానీ ఈసారి రైల్వే కామన్ వద్ద వన్ వే ట్రాఫిక్ వుండడం తో పండగ షాపింగ్ కోసం వచ్చే వారికి వన్ వే చుక్కలు చూపించింది.

వాహన దారులు గగ్గోలు పెట్టారు చాల మంది ఆంక్షలను ఆక్షేపించారు ప్రజా ప్రతినిధులను తిట్టిపోశారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ నేరుగా రైల్వే కామన్ వద్ద కు వెళ్లి ఆందోళనకు దిగారు. వన్ వే ను తొలగించాలని పండగలయ్యాక అమలు చెయ్యాలని కోరారు ఆయన నేరుగా అక్కడి నుంచే సీపీ కి ఫోన్ చేసి ఇదే అంశం ప్రస్తావించారు అప్పటికే సీపీ సైతం సాధారణ ప్రజానీకం ఇబ్బందులకు గురవుతున్న విషయం తెల్సి రైల్వే అధికారులను సంప్రదించి పనులు వాయిదా వేసుకోవాలని సూచించారు వెంటనే వన్ వే ను ఎత్తివేయాలని ట్రాఫిక్ అధికారులను ఆదేశించారు.

కొద్దీ నిమిషుల్లోనే ఆయా ప్రాంతాలోని బ్యారికేడ్ లను తొలగించడం తో హమ్మయ్య అంటూ నగర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు . దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో డబుల్‌ ట్రాక్‌ పనుల్లో భాగంగా కంటేశ్వర్‌ రైల్వే అండర్‌పాస్‌ విస్తరణ చేపట్టనున్నారు. ఇందుకోసం సుమారు 45 రోజుల పాటు వన్‌వే విధానం అమలు చేయాలని తొలుత నిర్ణయించారు.

ఆదివారం ఉదయం నుంచి ఆంక్షలు అమల్లోకి రావడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది.. దసరా పండుగ అనంతరం ఈ నెల 22 నుంచి అండర్‌పాస్‌ విస్తరణ పనులు తిరిగి ప్రారంభించే అవకాశమున్నట్లు సమాచారం. అప్పటి నుంచి ట్రాఫిక్‌ మళ్లింపులు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments