HomeCRIMEకొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు..రోడ్లు, ఫుట్‌పాత్‌లపై దుకాణాలపై చర్యలుకమిషనర్‌ దిలీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలన

కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు..రోడ్లు, ఫుట్‌పాత్‌లపై దుకాణాలపై చర్యలుకమిషనర్‌ దిలీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలన

నిజామాబాద్‌ నగరంలో ప్రదాన రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతున్నారు.

ఇందులో భాగంగా నగరంలోని 42, 18వ డివిజన్ల పరిధిలో రహదారులను ఆక్రమించి ఏర్పాటు చేసిన మూడు మడగలను మున్సిపల్‌ సిబ్బంది తొలగించారు. రహదారులు, ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురికావడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టారు.

నగరంలో రద్దీ పెరుగుతున్న తరుణంలో రహదారులు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు సమస్యగా మారుతున్నాయి. దుకాణాలు, మడగలు రోడ్లపైకి చొచ్చుకురావడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్రమణలను తొలగించి రహదారులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మున్సిపల్‌ యంత్రాంగం చర్యలు కొనసాగిస్తోంది.

కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ పర్యవేక్షణలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఆక్రమణల తొలగింపుపై దృష్టి సారించారు. ఆక్రమణల తొలగింపుతోనే సరిపెట్టకుండా, తిరిగి అదే ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేయకుండా అధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.

నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ రహదారులు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన నిర్మాణాలను గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటేనే ప్రజలకు ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. ఆక్రమణల తొలగింపు ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని నగరవాసులు కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ప్రదీప్, టీపీబీఓలు రాజేశ్, మంజునాథ్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments