తెలంగాణ హ్యాండ్ బాల్ సంఘం ఆదేశానుసారం
తేదీ 24-10-2026 రోజున క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్ చేపూర్
గ్రౌండ్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జూనియర్ హ్యాండ్ బాల్ బాలికల జట్టు ఎంపికలను ఉమ్మడి నిజాంబాద్ జిల్లా హ్యాండ్ బాల్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ ఎంపికలకు 50 మంది క్రీడాకారులు ఉమ్మడి జిల్లా నుండి పాల్గొనడం జరిగింది. ఎంపికలను జిల్లా హ్యాండ్ బాల్ సంఘం అధ్యక్షులు గంగామోహన్ చక్రు ప్రధాన కార్యదర్శి తుమ్మల విద్యాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఎంపికలకు
ముఖ్యఅతిథిగా నిజాంబాద్ హ్యాండ్ బాల్ సంఘం చైర్మన్ అల్జాపూర్ దేవేందర్ , విచ్చేశారు.
ప్రధాన కార్యదర్శి తుమ్మల విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ
ఎంపికైన క్రీడాకారులను
ఈనెల 31వ తేదీ నుండి నవంబర్ 2వ తేదీ వరకు ఖమ్మం జిల్లా సర్దార్ పటేల్ గ్రౌండ్స్ లో జరిగే 48వ తెలంగాణ రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ జూనియర్ బాలికల క్రీడా పోటీలకు పంపడం జరుగుతుందని తెలిపారు.
