అత్యున్న అధికారులు ……ప్రభుత్వ పెద్దలు జాన్ జిగ్రీ లని చెప్పుకునే ప్రజాప్రతినిధులప్రాతినిధ్యం ఉన్న నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిఅనేక అవలక్షణలతో అవస్థలు పడుతున్నా ఆవైపు కన్నెత్తి చూసే తీరికే వుండదు.
రోగాలు నయం చేసుకోవడానికి వచ్చే వారి సంగతి ఎలా ఉన్న విగతి జీవులు విషయంలోనూ అదే నిర్లక్ష్యం చివరికి అసెంబ్లీ వేదిక గా అర్బన్ ఎమ్మెల్యే గొంతెత్తి నెల రోజులైనా యంత్రాంగం నిమ్మకు నీరెత్తనట్లుగా ఉండి పోయింది.
సరే ఆలస్యమైనా యంత్రాంగం ఎట్టకేలకు కదిలింది సోమవారం ఆసుపత్రి లో మార్చురీ విభాగాన్ని అదనపు కలెక్టర్ భుజంగరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్చురీలో ఏర్పాటు చేసిన ఫ్రీజర్ల పనితీరుపై ఆరా తీశారు. ఎన్ని ఫ్రీజర్లు పనిచేస్తున్నాయి, ఎన్ని పనిచేయడం లేదనే వివరాలను ఫోరెన్సిక్ హెచ్ఓడీ నాగేంద్ర బాబు ని అడిగి తెలుసుకున్నారు. కొత్త ఫ్రీజర్ల కొనుగోలుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పురోగతిపై ఆరా తీశారు.
అవసరమైన కొత్త ఫ్రీజర్లను సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మార్చురీ పరిసరాల్లో కుక్కలు, కోతుల బెడద లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా మార్చురీ విభాగానికి అవసరమైన సిబ్బందిని ఆదేశించారు. మార్చురీలో మృతదేహాల భద్రత, నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ నాగేంద్ర బాబు, ఇతర అధికారులు ఉన్నారు.
