HomeTelanganaNizamabadసేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడిగా సంధి బెన్సన్‌ రాజు బాధ్యతల స్వీకరణ..

సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడిగా సంధి బెన్సన్‌ రాజు బాధ్యతల స్వీకరణ..

తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నేతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు

సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడిగా సంధి బెన్సన్‌ రాజు బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై విశ్వాసంతో బాధ్యతలు అప్పగించిన పీసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మహేష్‌ అన్న, యూసుఫ్‌ జాహీ, సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్‌ అన్న, డీసీసీ అధ్యక్షుడు నాగేశ్‌ రెడ్డి అన్న, గడుగు గంగాధర్‌, మనాల మోహన్‌ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తనకు అప్పగించిన బాధ్యతను నమ్మకంతో, నిబద్ధతతో నిర్వర్తిస్తానని, సేవాదళ్‌ బలోపేతానికి కృషి చేస్తానని సంధి బెన్సన్‌ రాజు పేర్కొన్నారు. నాయకులు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాసేవలో ముందుంటానని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments