చాదర్‌ఘాట్, ముసారాంబాగ్ వంతెనల వద్ద నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఈ క్రమంలోనే చాదర్‌ఘాట్ వంతెనకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, భారీ వర్షాల కారణంగా చాదర్‌ఘాట్ వంతెన వద్ద మూసీ నది గణనీయమైన ప్రవాహాన్ని ఎదుర్కొంటోందని తెలిపారు. పౌరులందరూ తమ భద్రత కోసం ఇళ్లలోనే ఉండాలని కోరారు.
