HomeTelanganaNizamabadఆ మాజీ మంత్రులకు చెక్ పడ్డట్లేనా ....మహేష్ కు పీసీసీ తో మారనున్న జిల్లాలో సమీకరణలు..

ఆ మాజీ మంత్రులకు చెక్ పడ్డట్లేనా ….మహేష్ కు పీసీసీ తో మారనున్న జిల్లాలో సమీకరణలు..

మహేష్ గౌడ్ కు పీసీసీ పగ్గాలు వచ్చాక జిల్లా కాంగ్రెస్ పార్టీ లో రాజకీయాయ్ సమీకరణాలు మారబోతున్నాయి.

మొన్నటి దాక పార్టీలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన ఇద్దరు మాజీ మంత్రులు వర్కింగ్ ప్రసిడెంట్ గా పీసీసీ లో కీలకంగా ఉన్నాసరే ఇద్దరు మాజీ మంత్రులు తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నారు.

జిల్లా పార్టీలో మహేష్ ప్రాబల్యం నామమాత్రంగా ఉండే. పార్టీలో భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఆయన అనేక వ్యవహారాల్లో వెనకడుగు వేయక తప్పలేదు.

ఓర్పు నేర్పు తో పార్టీలో పావులు కదుపుతూ వచ్చారు. గతంలో అర్బన్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన అయన కు నగర పార్టీలో కనీస ప్రాధాన్యత లేకుండా చేసారు. ముఖ్యనేతలెవ్వరు ఆయన గడప తొక్కకుండా కట్టడి జరిగింది.

దీనితో జిల్లా పార్టీలో ఆయనకు బలమైన వర్గమే లేకుండా పోయింది. మాజీ మంత్రలు సుదర్శన్ రెడ్డి షబ్బీర్ అలీ లు అర్బన్ లో అర్బన్ సెగ్మెంట్ లో మహేష్ ఆధిపత్యం లేకుండా వ్యూహాత్మకంగా పావులు కదుపు వస్తున్నారు.

ఆయనకు పీసీసీ ఇవ్వద్దని ఇద్దరు మాజీలు ఢిల్లీ స్థాయిలో ఏఐసీసీ పెద్దలను ఒత్తిడి చేయడం ఫై మహేష్ లోలోపల రగిలి పోతున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.

అనేక మంది ఢిల్లీ పెద్దలు అండగా ఉన్న నేపథ్యంలో ఇద్దరు మాజీ మంత్రుల నిర్వాహకం పార్టీ పెద్దల్లో చర్చనీయాంశం అయింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహేష్ ను లక్ష్యంగా చేసుకొని టికెట్ రాకుండ ప్రయత్నాలు చేసారు.

మహేష్ ను అర్బన్ టికెట్ ఇవ్వడానికి ఢిల్లీ పెద్దలుసానుకూలంగానే ఉండే ఈ మేరకు మొదటి జాబితా లో మహేష్ పేరు ను క్లియర్ చేశారు. కానీ తెరవెనుక మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మంత్రాగం నడిపారని పార్టీలో విసృతంగా ప్రచారం జరిగింది.

ఈసారి పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం వుందని సర్వేసంస్థలు సంకేతాలు ఇవ్వడంతో మహేష్ పోటీ ఆసక్తి చూపాడు. కానీ చివరిలో ఢిల్లీ లో సీన్ మారింది.

మైనారిటీ కోట ను తెరమీదికి తెచ్చారు అర్బన్ లో 38 శాతం మేరకు ముస్లిం వోటర్ల ఉన్నారని చెప్తూ మైనారిటీ నేత కు టికెట్ ఇవ్వాలని మైనారిటీ అగ్ర నేతలతో అధిష్టానం వద్ద ఒత్తిడి చేయించారు.

దీనితో టికెట్ రేసు నుంచి మహేష్ తప్పుకోవడం అనివార్యం అయింది.కామారెడ్డి కి చెందిన మాజీ మంత్రి షబ్బీర్ చివరిలో ఎంట్రీ ఇచ్చాడు.

ఈ పరిణామాలతో మహేష్ రగిలి పోయారు. తెరవెనుక సుదర్శన్ రెడ్డి చక్రం తిప్పారనేది మహేష్ బలంగా నమ్మారు అదీగాక ఆకుల లలితా ను పార్టీలో చేర్చుకునే విషయంలో మహేష్ మాట చెల్లు బాటు కాకుండా కూడా చేసారు.

ఎన్నికల్లో ఓడిపోయాక కూడా షబ్బీర కామారెడ్డి తో పాటు అర్బన్ లోనూ పాగా వేసారు. మరో ఎమ్మెల్సీ గా నియామకం ఆయన కూడా అర్బన్ సెగ్మెంట్ లోనే ప్రొటొకాల్ ఇచ్చారు.

అయినప్పటికి పాలన వ్యవహారాల్లో ఆయన మాట చెల్లుబాటు కావడం లేదు. పీసీసీ రేసు లో అనూహ్యంగా వచ్చిన మహేష్ జిల్లా లో జరుగుతున్న పరిణామాల విషయంలో చూసి చూడనట్లుగా వుంటూ వస్తున్నారు.

పీసీసీ పగ్గాలు చేతికి దక్కడంతో ఆయన జిల్లాపార్టీలో పాలన వ్యవహారాల్లో తన ముద్ర వేసుకునే దీక్షగా పావులు కదిపే అవకాశం ఉంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments