HomeCRIMEపోలీసుల మీద గంజాయిముఠా కాల్పులు .....వెంటాడి పట్టివేత

పోలీసుల మీద గంజాయిముఠా కాల్పులు …..వెంటాడి పట్టివేత

హైదారాబాద్ లో కరుడు గట్టిన గంజాయి ముఠా పోలీసుల మీదే కాల్పులకు తెగబడింది. అప్రమత్తం అయిన పోలీసులు వెంటాడి ముఠా ను పట్టుకుంది.

ఈ ఘటన మంగళవారం తెల్లవారు జమునా రాజేంద్ర నగర్ ఓ ఆర్ ఆర్ సమీపం లో చోటుచేసుకుంది. ఇతర రాష్ట్రల నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో మంగళవారం తెల్లవారుజామున రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్‌లో మఫ్టీ లో పోలీసులు మాటు వేశారు.

ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా వస్తున్న రెండు కార్లను అడ్డగించారు. ఆ కారులో నుంచి ఇద్దరు దిగి తుపాకీ తో పోలీసుల మీదకి దూసుకొచ్చారు.

రెప్పపాటు కాలం లోనే గాల్లో కాల్పులు జరిపారు. దీనితో పోలీసులు వెనక్కి తగ్గారు అదే అదనుగా కారుల్లో పారిపోయారు.కానీ క్షణాల్లో తేరుకున్న పోలీసులు వారిని వెంబడించి ఐదుగురు ని పట్టుకున్నారు.

వారంతా ఉత్తరప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు. అలాగే వారి వద్ద నుండి 240 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడమే కాకుండా నిందితులు ఉపయోగించిన రెండు కార్లను సీజ్ చేసారు .

పొరుగు రాష్ట్రాల నుంచి హైదారాబాద్ కు ఈ ముఠా గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తుందని పోలీసులు చెప్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments