HomeCRIMEపవర్ పెట్రోల్ అని నమ్మించి... నార్మల్ పెట్రోల్ పోస్తున్నారంటూ రచ్చ .... మూకమ్మడిగా నిలదీసిన యువకులు...

పవర్ పెట్రోల్ అని నమ్మించి… నార్మల్ పెట్రోల్ పోస్తున్నారంటూ రచ్చ …. మూకమ్మడిగా నిలదీసిన యువకులు …అర్ధరాత్రి గలాటా

! ఓ వ్యక్తి మార్గ మధ్యలో తన వాహనంలో పెట్రోల్ పోసేందుకు వీక్లీ మార్కెట్ వెళ్ళే దారిలోని హెచ్ పీ పెట్రోల్ బంక్ కి వెళ్లి వాహనంలో లీటర్ పవర్ పెట్రోల్ కొట్టమని డబ్బులు చెల్లించాడు.

సదరు పెట్రోల్ బంక్ సిబ్బంది పవర్ పెట్రోల్ కాకుండా నార్మల్ పెట్రోల్ పోసి నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ వాహనదారుడు సిబ్బందిని నిలదీసి ప్రశ్నించగా పవర్ పెట్రోల్ పోసానంటూ బుకాయించారు.

అందుకు వాహనదారులు నీళ్ళ బాటిల్ లో పెట్రోల్ పోసుకొని, వేరొక చోట ఉన్న హెచ్ పీ పెట్రోల్ బంక్ లో పవర్ పెట్రోల్ పోయించాడు. అందులో పవర్ పెట్రోల్. నార్మల్ పెట్రోల్ ను అక్కడి సిబ్బంది గుర్తించారు. దీనితో పవర్ పెట్రోల్ బాగోతం రట్టు అయింది. .

వాహనదారులు హుటాహుటిన వెళ్లి నిలదీయగా చేసేదేమి లేక నిజం ఒప్పుకున్నారు. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా ఎవ్వరికీ చెప్పకు అని వాహనదరుడిని కోరారు. అప్పటికే అక్కడికి చేరుకున్న వాహనదారులు సైతం ఆ యువకులకు తోడయ్యారు .

దీనితో పెట్రోల్ బ్యాంకు లో పనిచేస్తున్న సిబ్బంది వారికి నచ్చజెప్పే యత్నం చేశారు. మొదట ఆ యువకుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడటంవల్లే వివాదం చిలికి చిలికి గాలి వానల మారిపోయింది.

ముఖ్యమైన అధికారులుండే జిల్లా కేంద్రంలోనే పెట్రోల్ బ్యాంకు లో కళ్ళముందు మోసాలు జరుగుతున్నా విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.

వెంటనే విజిలెన్స్ సివిల్ సప్లై అధికారులు బంక్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments