పేకాట స్థావరం పై దాడి చేసి పదిమందినీ అరెస్ట్ చేసినట్లు ఒకట టౌన్ సిఐ విజయ్ బాబు పేర్కొన్నారు.వివరాల్లోకి వెళ్లితే..
ఒకటవ టౌన్ పరిధిలోని నాగేంద్రుని గుడి వెనుకాల ప్రదేశంలో పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి పదిమంది పేకాట రాయుళ్లు ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
వారి నుంచి రూ. 9200 నగదు, 2 బైకులు, మరియు 9 స్మార్ట్ ఫోన్స్ స్వాధీన పరచుకున్నట్లు తెలిపారు. 10 మంది పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విజయ్ బాబు తెలిపారు.
