HomeTelanganaHyderabadమూసి ప్రక్షాళన షురూ ....రంగంలోకి దిగిన హైడ్రా .......

మూసి ప్రక్షాళన షురూ ….రంగంలోకి దిగిన హైడ్రా …….

మూసి నది ప్రక్షళన కు ప్రణాళిక ఖరారు చేసిన ప్రభుత్వం కాల్వ కు ఇరువైపుల ఉన్న అక్రమానిర్మాణాలను కూల్చేయడానికి హైడ్రా ను రంగంలోకి దించింది.

ఇప్పటికే అక్రమ నిర్మాణాలను పక్కాగా గుర్తించిన అధికారులు ఇక కూల్చివేత కార్యాచరణకు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం కూకట్ పల్లి నల్ల చెరువులో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేశారు.

 ఈ పక్రియ కు ఆటంకం రాకుండా భారీఎత్తున పోలీసు బలగాలను మోహరించింది.దీంతో అక్కడ వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులు కన్నీటి పర్యంతమయ్యారు.

 లక్షలు ఖర్చు పెట్టి వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని.. వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు.  మహిళలు ఏడుస్తూ అధికారులను వేడుకుంటున్నా .. అయినప్పటికీ హైడ్రా అధికారులు వారి పని వారు చేశారు…..

గతంలోనే 16 వ్యాపార సముదాయాలకు నోటీసులు ఇచ్చామని.. అధికారులు చెప్తున్నారు.గత ప్రభుత్వంలో పదేళ్లుగా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారని ఇప్పుడు ఉన్నపలంగా కూల్చివేతలు చేయడం పట్ల స్థానికులు సైతం ఆక్షేపించారు.

పేదవారిపట్ల దయ చూపాలని వారు వేడుకుంటున్నారు.కూకట్ పల్లిలోని నల్లచెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు. అయితే, దీనిలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైంది.

బఫర్ జోన్లోని నాలుగు ఎకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్టు మెంట్లు నిర్మించారు. ఎఫ్టీఎల్ లోని మూడు ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. ప్రస్తుతం 16షెడ్లను హైడ్రా కూల్చివేసింది.అయితే నివాస సముదాయాల జోలికి మాత్రం హైడ్రా వెళ్లడం లేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments