రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన డిచ్ పల్లి మండలం పరిధి లో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు నిజామాబాద్ లోని దారుగల్లికి చెందిన షేక్ పర్వేష్(40).
భార్య నలుగురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో అంబులెన్స్ డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
బుదవారం విధులు అనంతరం తన ద్విచక్ర వాహనం పై హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపుగా వెళ్తున్న సమయంలో బీబీపూర్ వద్ద పక్కనుంచి వస్తున్న అశోక్ లేలాండ్ వాహనం ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి.
అక్కడే ఉన్న స్థానికులు 108 లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుదవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
