HomePOLITICAL NEWSUncategorizedతెలంగాణ బీజేవైఎం రాష్ట్ర కో కోశాధికారిగా ఆమంద్ విజయ్ కృష్ణ నియామకం

తెలంగాణ బీజేవైఎం రాష్ట్ర కో కోశాధికారిగా ఆమంద్ విజయ్ కృష్ణ నియామకం

ఈరోజు బీజేవైఎం తెలంగాణ యువమోర్చ రాష్ట్ర కమిటీని ప్రకటించగా, నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నాయకుడు ఆమంద్ విజయ్ కృష్ణ గారు రాష్ట్ర కోశాధికారిగా నియమితులయ్యారు.

జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహిస్తూ, నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న విజయ్ కృష్ణ గారికి రాష్ట్ర స్థాయి బాధ్యత రావడం పట్ల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.గత 15 సంవత్సరాలుగా పార్టీకి అంకితభావంతో సేవలు అందిస్తున్న ఆయన, బీజేవైఎం డివిజన్ కార్యదర్శి స్థాయి నుంచి తెలంగాణ బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి స్థాయికి ఎదగడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆమంద్ విజయ్ కృష్ణ గ మాట్లాడుతూ —“నా పై నమ్మకం ఉంచి, నా నియామకానికి కృషి చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు గారికి ఇందూరు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ గారికి, జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి గారికి, శాసనసభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ గారికి, పైడి రాకేష్ రెడ్డి గారికి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారికి, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి గారికి, యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు కుండే గణేష్ గారికి మరియు బీజేపీ సీనియర్ నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని అన్నారు.భవిష్యత్తులో బీజేవైఎం ఆధ్వర్యంలో మరిన్ని ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తానని విజయ్ కృష్ణ గారు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments