నిజామాబాద్ నగరంలోని నాగారంలో గల ప్రభుత్వ బాలుర జువెనైల్ హోమ్ (బాలల పరిశీలన గృహం) నుంచి మంగళవారం ఉదయం ఓ బాలుడు తప్పించుకు పారిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం… ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల బాలుడు ఒక కేసు నిమిత్తం ఈ జువెనైల్ హోమ్‌లో ఉంటున్నాడు.
ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున సిబ్బంది కళ్లుగప్పి సదరు బాలుడు అక్కడ నుంచి పరారయ్యాడు. ఉదయం గమనించిన హోమ్ నిర్వాహకులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
జువెనైల్ హోమ్ అధికారుల ఫిర్యాదు మేరకు నిజామాబాద్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. తప్పించుకున్న బాలుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.
