HomeCRIMEప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి..

ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి..

ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.నగరంలోని ఆనంద్ నగర్ కు చెందిన కుర్రే శ్రీనివాస్(50).

గత నాలుగు సంవత్సరాలుగా భార్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం సమయంలో బాత్రూం కి వెళ్లి క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారీ పక్కనే ఉన్న బండలపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఆలస్యం గా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ గంగాధర్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments