ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయి లను వెంటనే విడుదల చేయాలనిడిమాండ్ చేస్తూ ప్రైవేటు కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఆందోళనకు సిద్ధం అవుతుంది.ఈ మేరకు తెలంగాణ యునివర్సిటీ రిజిస్టార్ ను కలిసి లిఖిత పూర్వకంగా తెలియజేసారు. సెమిస్టర్ పరీక్షలు బహిష్కరిస్తామని అధ్యక్ష కార్యదర్శులు హరిప్రసాద్, సంజీవరెడ్డి . లు స్పష్టం చేశారు నిరవధిక సమ్మెలో భాగంగా మంగళవారం తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్టార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
రెండేళ్లుగా బకాయిలు విడుదల కాకపోవడంతో కళాశాల నిర్వహణ భారంగా మారిందన్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు మంత్రులకు, అధికారులకు విన్నవించామని, ముఖ్యమంత్రిని కలవాలని ప్రయత్నించినా.. తమకు సమయం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కళాశాలలోని అధ్యాపకులకు గత ఐదు నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనల్లో భాగంగానే జిల్లాలో ను కాలేజీ లను బంద్ చేస్తున్నామన్నారు.
