HomeTelanganaNizamabadమేయర్ భర్త ను పరామర్శించిన బిగాల

మేయర్ భర్త ను పరామర్శించిన బిగాల

దాడిలో గాయపడ్డ మేయర్ భర్త శేఖర్ ను మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ మంగళవారం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు .అనంతరం ఆయన మాట్లాడుతూ మేయర్‌ భర్త దండు శేఖర్‌పై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు .

సాక్షాత్తు మేయర్‌ భర్తపై దాడిజరిగిందంటే నగరంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ప్రజలు గమనించాలన్నారు. మా ప్రభుత్వంలో అభివృద్ధితో పాటు శాంతి భద్రతల రక్షణకు ఎంతో కృషి చేశామన్నారు.

కానీ ప్రస్తుతం పరిస్థితుల అలా లేవన్నారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడులు చేస్తే ఉరుకోబోమని స్పష్టం చేశారు. రాజకీయాలు చేయడానికి అనేక అంశాలు ఉన్నాయని.. అంతేకాని భౌతిక దాడులు సరికాదన్నారు.

దాడి వెనుక ఎవరి హస్తం ఉన్నా వారందరిని శిక్షించాలనిడిమాండ్ చేశారు . మేయర్‌ కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments