నరాల సమస్య తో నిపుణుడైన డాక్టర్ కు చూయించుకోవాలని వచ్చిన ఓ మహిళా కు రిసెప్షన్ సిబ్బంది డాక్టర్ అవతారం ఎత్తారు. అర్జెంట్ గా ఈ టెస్టు లు చేయించుకోవాలంటూ ఆసుపత్రి లెటర్ హెడ్ మీద రాసి ఇచ్చింది.
ఏ ఏ పరీక్షలు చేసుకోవాలో ఆమె రాసింది. అదేమిటి మేము నరాల డాక్టర్ ను చుపెట్టుకున్నాకే కదా ఇవన్నీ పరీక్షలు చేసుకోవాలి కదా ముందే ఈ టెస్టులు ఎందుకు అంటూ అయినా డాక్టర్ కదా ఇవన్నీ రాయాల్సింది మీరెవరు అంటూ సదురు మహిళా పక్షనా వచ్చిన యువకుడి గద్దించాడు.

ఔనూ టెస్టు లు నేనే రాస్తా దానికి డాక్టర్ ఎందుకు అంటూ సదురు రిసెప్షన్ దబాయించింది. చివరికి హిందూ వాహిని ప్రతినిధులు రంగంలోకి దిగడం తో డాక్టర్ వచ్చి నీళ్లు నములుతూ సర్దు చెప్పాడు.
నగరంలోని ఖలీల్ వాడి లో విజయ ఆసుపత్రి లో ఈ వ్యవహారం వెలుగు చూసింది .వైద్యం కోసం వచ్చిన రోగులకు రిసెప్షన్ సిబ్బంది టెస్టులు రాసి ఇవ్వడం చర్చ గా మారింది. నవీపేట్ మండలం నాళేశ్వర్ కు చెందిన ఓ మహిళా అనారోగ్యం తో వైద్యం కోసం వస్తే డాక్టర్ ను కలిసి ఆయన చెప్పిన టెస్టులు చేయించుకోవాలి.
కానీ విజయ ఆసుపత్రి లో డాక్టర్ ను సంప్రదించకుండా నేరుగా ఓ పి లో 400 ఫీజు తీసుకొని సుమారు రెండు నుండి మూడు వేల రూపాయల తీసుకోని టెస్టులు వ్రాసి ఇచ్చారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగిన రోగి కుటుంబ సభ్యులను గెంటేసి యత్నం చేశారు.
విషయం తెల్సి న్యాయ వాదీ శ్రీకాంత్ రెంజల్ కు చెందిన బుజ్జి లు వచ్చి మహిళా పక్షనా డాక్టర్ ను నిలదీశారు.
