HomeCRIMEగంగాస్థాన్ వద్ద రెండు కార్లు ఢీ.. పలువురికి తీవ్ర గాయాలు..

గంగాస్థాన్ వద్ద రెండు కార్లు ఢీ.. పలువురికి తీవ్ర గాయాలు..

నగరంలోని గంగాస్థాన్ ఫేజ్-1 ప్రాంతంలో రెండు కార్లు ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగాస్థాన్ ఫేజ్-1 ప్రధాన రహదారిపై రెండు కార్లు వేగంగా వస్తూ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు లోపలే చిక్కుకుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన బాధితులను హుటాహుటిన చికిత్స నిమిత్తం నగరంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని, వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారని సమాచారం.ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments