నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో రోడ్డు భద్రత మాసోత్సవాలపై డ్రైవర్ లకు అవగాహన కల్పించారు. నిజామాబాదు రీజినల్ మేనేజర్ కార్యాలయంనందు టి.జి.ఎస్. ఆర్టీసీ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను ప్రారంభించారు.
జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాల్లో భాగంగా శనివారం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ ఉద్యోగులకు అదేవిధంగా డ్రైవర్లకు రోడ్డు భద్రతా అవగాహన కల్పించారు.
మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రాహుల్, కిరణ్ కుమార్ గారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పాల్గొని రోడ్డు మీద ఎలా ప్రయాణించాలి హెల్మెట్ యొక్క అవసరం ఉందని, అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్లకు ఎటువంటి యాక్సిడెంట్ జరుగుతాయి బస్సుల వల్ల వాటిని నివారించడం, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనీ వారికి అవగాహన కల్పించారు.
రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా 06వ తేదీన వైద్య పరీక్షల రోజు: సంబంధిత వైద్యాధికారులు, అన్ని డిపో మేనేజర్లు సమన్వయంతో డిపో డ్రైవర్లకు మరియు ఉద్యోగులకు ఆరోగ్య పరీక్షలు 08 న రక్తదానం:
డిపో వారిగా రక్తదాన శిబిరాలు. 09న నిర్వహణ దినం: ఉత్తమ మెకానిక్లను మరియు సహాయకులు / శ్రామిక్లు మరియు వారికి బహుమతులు, 21న ప్రమాదాలకు గురయ్యే డ్రైవర్లను కుటుంబ సమేతంగా ఫ్యామిలీ కౌన్సెలింగ్, 24 తేదిన – డ్రైవర్ల దినోత్సవం: భద్రత కోసం బస్సు డ్రైవర్లను గౌరవించడం ద్వారా భద్రతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
అలాగే 28 వ తేదీన శిక్షణ రోజు: డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్, ధూమపానం, పొగాకు నమలడం వంటి అలవాట్ల నుండి అవి డ్రైవింగ్పై ఏకాగ్రత స్థాయిని క్షీణింపజేస్తాయి. వాటిపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడును. 31 వ తేదీన సన్మాన దినం: నెలలో చేసిన అన్ని కార్యకలాపాలను సంక్షిప్తీకరించడానికి మరియు ప్రమాద రహిత సర్వీస్ రికార్డు కలిగిన డ్రైవర్లను ఈ కార్యక్రమంలో సత్కరిస్తారు.
ఈ కార్యక్రమంలో ఐరాడ్ జిల్లా మేనేజర్ వర్షా నియంత,ఎన్. సరస్వతి, డిప్యూటి రీజినల్ మేనేజర్ (ఓ). వి. శంకర్, డిప్యూటి రీజినల్ మేనేజర్ (ఏం),. బి. ఆనంద్, డిపో మేనేజర్, నిజామాబాదు-1, ఎస్. సాయన్న, నిజామాబాదు-2 పద్మజా, పర్సనల్ ఆఫీసర్, అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.
