ట్రాఫిక్ పోలిస్ స్టేషన్ ముందు నుంచి చోరికి గురైన ద్విచక్ర వాహనాన్ని పోలీసులు ఆగమేఘాల మీద గాలించి ఎట్టకేలకు పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. తీర్మాన్ పల్లి గ్రామానికి చెందిన నాగరాజు డిసెంబర్ 26 పనులు నిమిత్తం నిజామాబాద్ నగరానికి వచ్చాడు.నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌరస్తా వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసులు అతని వాహనం పై ముగ్గురు ఉన్నట్లు గమనించి వాహనాన్ని సీజ్ చేసి ట్రాఫిక్ పోలిస్ స్టేషన్ కు తరలించారు.
ట్రిబుల్ డ్రైవింగ్ నిర్వహించినందున చాలా కట్టలనని పోలీసులు గద్దించారు.అందుకు నాగరాజు తన వద్ద డబ్బులు లేకపోవడంతో తరువాత రోజు వచ్చిన చలన్ కట్టి తీసుకెళ్తానని చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు. డిసెంబర్ 27 న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు వచ్చి చూసేసరికి పోలీస్ స్టేషన్ ముందు నుంచి అతని వాహనం కనిపించలేదు.
దీంతో చుట్టూ పక్కల ఎంత గాలించినా వాహనం లభించలేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ద్విచక్ర వాహనం చోరికి గురుందని ఒకటవ టౌన్ లో కేసు నమోదు చేశారు.
పోలిసులు వాహనాన్ని గాలించి మహారాష్ట్రలో ఉన్నట్లు గుర్తించారు.ఎట్టకేలకు జనవరి 3 న మహారాష్ట్రలోనీ వాహనాన్ని పట్టుకొని నిజామాబాద్ కి తీసుకొచ్చారని తెలిపారు.
