నూతన ఇంట్లోకి వెళ్లే హడావుడి లోఉన్న కుటుంబంపై మూకుమ్మడిగా వచ్చి కర్రలతో దాడులు చేశారు. ఈ సంఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్లో ఆదివారం తెల్లవారు జామున జరిగింది.
పోలీసులు చెప్పిన వివరాల మేరకు బోడుప్పల్ దేవేందర్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించుకున్న ఓ ఇంట్లో గృహప్రవేశం జరుగుతుండగా.ఓ గ్యాంగ్ మూకుమ్మడిగా వచ్చారు కర్రలు, రాళ్లతో దాడి చేశారు ఈ గ్యాంగ్ ఒక్కసారిగా గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి చొరబడింది.
ఇంట్లో ఉన్న మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులపై కర్రలతో దాడులు చేశారు. అడ్డు వచ్చిన వారిపై రాళ్లు రువ్వారు. ఈ భీకర దాడిలో వేడుకకు వచ్చిన బంధువుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
వీరిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడితో దేవేందర్ నగర్ కాలనీవాసులు బీతిల్లి పోయారు . బాధితుల సమాచారం మేరకు మేడిపల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు స్థానికంగా ల్యాండ్ వివాదమే ఈ దాడి కి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది
