ఏపీ కి చెందిన విజయవాడ ఎంపీ హైదరాబాద్ లో వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా చేసాడని ఆయన సొంత అన్న మాజీ ఎంపీ నాని సీఎం రేవంత్ రెడ్డికి లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసాడు.
శంషీగూడలో టీజీఐఐసీ ఐటీ పార్క్ కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు కేశినేని కుటుంబానికి చెందిన బినామీ సంస్థ ప్రయత్నం చేస్తోందని నాని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రూపంలో ఫిర్యాదు చేశారు.
ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడానికి ఎంపీ , ఆయన బినామీ సంస్థలైన ‘మెసర్స్ ఎక్సెల్లా లు యత్నిస్తున్నాయని నాని ఈ లేఖలో ఆరోపించారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లు ఇచ్చిన పాత ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి, నకిలీ లీగల్ సెటిల్మెంట్లతో నిందితులు ఏకంగా సుప్రీంకోర్టును సైతం తప్పుదోవ పట్టించారని నాని ధ్వజమెత్తారు.అయితే నాని ఆరోపణల చిన్ని కొట్టిపారేశారు.
