నిజామాబాద్ రూరల్ మండల పరిధిలో ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించేలా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ మరియు సహాయ ఓటర్ నమోదు అధికారి వినయ్ సాగర్, బీఎల్ఓ సూపర్వైజర్ హరీష్ రెడ్డి, బీఎల్ఓ రుక్మిణి, సీనియర్ సహాయకులు మహేందర్, గ్రామ పాలన అధికారి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్ పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ..జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఎన్యూమరేషన్ ఫారాల అందజేత
RELATED ARTICLES
