ఎర్గట్ల మండలం తోర్తి గ్రామo లో జాతీయ పక్షి నెమలి విషపు గుళికలు తిని మృతి చెందిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మృతిచెందిన నెమలికి పశువైద్య అధికారి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అటవీ శాఖ నిబంధనల ప్రకారం జేసీబీతో గుంత తవ్వించి నెమలి కళేబరాన్ని పూడ్చివేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ రాహుల్, జీపీఓ భూమన్న, ఫారెస్ట్ ఆఫీసర్ వరుణ్‌తో పాటు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు. నెమలి మృతికి గల పూర్తి కారణాలపై అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
