HomePOLITICAL NEWSUncategorizedరూరల్ సీఐ కి వీ డీ సీ సభ్యుల సన్మానం.

రూరల్ సీఐ కి వీ డీ సీ సభ్యుల సన్మానం.

నిజామాబాద్ రూరల్ మండలంలోని నగరపాలక సంస్థ పరిధి ఒకటవ డివిజన్ ఖానాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ( వీ డీ సీ) ఇటీవల నూతనంగా ఏర్పడింది. ఈ నేపధ్యంలో వీ డీ సీ చైర్మన్ జగన్ యాదవ్, వైస్ చైర్మన్ సాలుగారి మోహన్, క్యాషియర్ సంపత్, ప్రధాన కార్యదర్శి బెంజీ ల ఆధ్వర్యంలో సభ్యులు సోమవారం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వారు సీఐ ని శాలువాతో సత్కరించారు. గ్రామంలో ఎల్లప్పుడూ శాంతిభద్రతలకు ప్రజలు సహకరించేలా వీడీసీ సభ్యులు చొరవ చూపాలని సీఐ సూచించారు.

ముఖ్యంగా యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చూడడంతో పాటు గ్రామ అభివృద్ధిలో వారు భాగస్వాములయ్యేలా చూడాల్సిన బాధ్యతను వీడీసీ సభ్యులు గుర్తెరుగాలన్నారు.

గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చొరవ చూపుతూ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన వీడీసీ సభ్యులకు సూచించారు. సీఐ ని కలిసిన వారిలో వీడీసీ సలహాదారులు కోర్వా గంగా నరసయ్య, సాయికుమార్, దేవన్నా, సురేష్, శంకర్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments