HomeTelanganaNizamabadకొలువుతీరిన చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గం..

కొలువుతీరిన చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గం..

నిజామాబాద్ చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గం కొలువుదీరింది..ఇటీవల సంఘానికి ఎన్నికలు జరగగా సోమవారం పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది.

సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైన గుజ్జ రాజేశ్వరి పూజా కార్యక్రమాలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు..సంఘం మాజీ అధ్యక్షుడు గుద్దేటి రామకృష్ణ నూతన అద్యక్షురాలు రాజేశ్వరికి బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా సంఘం అద్యక్షురాలు రాజేశ్వరి మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు.చేనేత రంగానికి పూర్వ వైభవం తెచ్చేలా పాటుపడతానన్నారు.చేనేత సంఘం ప్రధాన కార్యదర్శి పెంటి రాజు,కోశాధికారి నందాల నరేష్,డైరెక్టర్లు దిండిగల్ల శంకర్,కైరంకొండ బాల్ రాజ్,కారంపూరి ప్రభు,గాలిపల్లి అరుణలు కూడా ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించారు‌.

చేనేత సంఘం ఎన్నికల అధికారి పోశన్న,పద్మశాలి హాస్టల్ అధ్యక్షుడు దీకొండ యాదగిరి,జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బిజ్జు దత్తాద్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హన్మాండ్లు,గౌరవ సలహాదారులు రాపెల్లి గురుచరణ్,నగర పద్మశాలి సంఘం ఉపాద్యక్షులు కన్న దుబ్బ రాజం, ప్రధాన కార్యదర్శి చౌటి భూమేశ్వర్,నగర సంఘం మాజీ అద్యక్షులు ఎస్సార్ సత్యపాల్,చేనేత సంఘం మాజీ ప్రధాన కార్యదర్శిసబ్బని ప్రసాద్,జిల్లా సంఘం ప్రతినిధులులక్కవత్రి దేవీదాస్,బింగి ధర్మవీర్,చింతల గంగాదాస్,గుజ్జ బాలమల్లు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments