ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం( పి డి ఎస్ యు) ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఉన్న అంబేద్కర్ చౌరస్తా వద్ద అధ్యక్షులు డి.నికిల్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించి.ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్నం చేశారు.
దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున నీట్ పేపర్ లీకేజ్ వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు . ఆ త్యాగాలను గుర్తు చేసుకుంటూ విద్యార్థులు విజయం సాధించామని ఒకవైపు ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే. చేవల ఎంపీ బిజెపి కొండ విశ్వేశ్వర్ రెడ్డి విద్యార్థి ఉద్యమాన్ని అవహేళన చేసినట్టు మాట్లాడుతూ వేరే దేశాల్లో అయితే తుపాకులతో కలుస్తారు అనే మాట సరైనది కాదని .
వారు మాట్లాడిన మాట వెనక్కి తీసుకొని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ దేశానికి విద్యార్థులు వెన్నుముక్క నేటి బాలులే రేపటి బావి భారత పౌరులు.
ఉద్యమాలు ఎంతోమంది విద్యార్థులు నిరుద్యోగులకు స్ఫూర్తిగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు ఏరియా ప్రధాన కార్యదర్శి రాజు , కార్యదర్శి సిద్ధార్థ , ఏరియా మంగల్దీప్ , ఆదిత్య , ఆనంద్ , రూపక్ , గోపాల్ , మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
