ప్రేమ వ్యవహారం ఎమ్మెల్యే వర్సెస్ కొడుకుల ల మారింది.తాను ప్రేమించిన అమ్మాయి ని లక్ష్యంగా చేసుకొని ఎమ్మెల్యే అయిన తన తండ్రి భౌతిక దాడులు చేస్తున్నాడని తనని కూడా అంతం చేసేలా ఉన్నాడని ఎమ్మెల్యే కొడుకు రచ్చకెక్కాడు పోలీసులను ఆశ్రయించాడు
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌పై ఆయన కొడుకు సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడం తన తండ్రికి ఇష్టం లేదని అన్నారు.
ఈ క్రమంలోనే.. తనకు కాబోయే భార్య ఇంటిపై తన తండ్రి అనుచరులతో దాడి చేయించి, తమను హత్య చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
