HomeEditorial Specialనిజామాబాద్ మార్కెట్ కమిటీ దొడ్డి దారి దందా లు అక్రమాల చిట్టారెగ్యులర్ సిబ్బందిని పక్కనబెట్టి...

నిజామాబాద్ మార్కెట్ కమిటీ దొడ్డి దారి దందా లు అక్రమాల చిట్టారెగ్యులర్ సిబ్బందిని పక్కనబెట్టి ……ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి కీలక బాధ్యతలు….. చైర్మన్ ఆదేశాల తో చేశామంటున్న అధికారులు..

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ దొడ్డి దారి దందా లకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.. రెగ్యులర్ సిబ్బంది ఉన్నప్పటికీ కీలక బాధ్యతలను ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గత ఏడాది మార్కెట్ కమిటీకి హైదరాబాద్ నుంచి సూపరింటెండెంట్‌గా వచ్చిన ఓ అధికారి నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని ప్రయత్నించినట్లు సమాచారం. ముఖ్యంగా అకౌంట్స్ విభాగంలో రెగ్యులర్ సిబ్బందినే కొనసాగించాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది.

అయితే అకౌంట్స్ విభాగంలో రెగ్యులర్ సిబ్బందిగా పనిచేస్తున్న సూపర్‌వైజర్ కిషన్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి, ఆ విభాగాన్ని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న గురుదాస్ రెడ్డికి అప్పగించడం ఫై అనేక ఆరోపణలుఉన్నాయి.రెగ్యులర్ సిబ్బందిని ఎందుకు తప్పించారు?అకౌంట్స్ విభాగం వంటి ముఖ్యమైన బాధ్యతలను రెగ్యులర్ సిబ్బందికి కాకుండా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి ఎందుకు అప్పగించారనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.సూపరింటెండెంట్ ఈ విషయంపై సూచనలు చేసినప్పటికీ వాటిని పట్టించుకోకుండా నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ వ్యవహారంపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

గురుదాస్ రెడ్డి కారును మార్కెట్ కమిటీకి లీజ్‌కు ఇచ్చారా?ఈ వ్యవహారంలో మరో అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న గురుదాస్ రెడ్డి తన సొంత కారును మార్కెట్ కమిటీకి లీజ్‌కు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.మార్కెట్ కమిటీలో కీలకమైన అకౌంట్స్ విభాగం బాధ్యతలు గురుదాస్ రెడ్డికి అప్పగించారని ఆరోపణలు వస్తుండగా, మరోవైపు ఆయనకు చెందిన కారునే మార్కెట్ కమిటీ లీజ్‌కు తీసుకోవడం చర్చినీయంశము అయింది .

ఆ కారు ఏ నిబంధనల ప్రకారం లీజ్‌కు తీసుకున్నారు? నెలకు ఎంత మొత్తం చెల్లిస్తున్నారు? కారు ఏ అవసరాలకు ఉపయోగిస్తున్నారు? లీజ్ ప్రక్రియను ఎవరు ఆమోదించారు? అనే వివరాలను మార్కెట్ కమిటీ అధికారులు బయటికి పొక్కనీయడం లేదు మార్కెట్ కమిటీలో నిబంధనల ప్రకారం పనిచేయాలని ప్రయత్నించిన సూపరింటెండెంట్‌ను చివరకు అక్కడి నుంచి బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

ఆయన అకౌంట్స్ విభాగంలో రెగ్యులర్ సిబ్బందిని కొనసాగించాలని సూచించిన తర్వాతే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే బదిలీకి అసలు కారణం ఏమిటనేది అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

ఉన్నతాధికారులు విచారణ చేయాలినిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో జరుగుతున్న ఈ వ్యవహారాలపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేయాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments