గణపతి నవరాత్రి ఉత్సవాలు అంబరాన్ని తాకేలా సాగుతున్న వేళ విద్యుత్తు కాంతులతో వెలిగి పోవాల్సిన నగరం గాఢ అంధకారం లోకి వెళ్ళింది.కాలనీ ల సంగతి ఎలా ఉన్న ప్రధానవిధులే చిమ్మచీకట్లో మగ్గుతున్నాయి.
నిజానికి గణపతి నవరాత్రి ఉత్సవాలను దృష్టి లో పెట్టుకొని ముఖ్యంగా రాత్రి వేలలో ప్రజల సౌకర్యార్థం ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక విధి దీపాలను మున్సిపల్ యంత్రాంగం అందుబాటులోకి తెచ్చేది. ఎందుకంటీ కొలువుదీరిన గణపతి ప్రతిమలను తిలకించడానికి ప్రతి రోజు వెలది మంది వస్తారు ఇదో ఆనవాయితీ గా వస్తుంది.
అదీగాక నిమజ్జనం నాడు శోభాయాత్ర సాగె ప్రాంతాల్లో వీధులు విద్యుత్ వెలుగుల్లో జిగేల్ మనేలా తీర్చి దిద్దుతారు కానీ ఈసారి నగరం లో అలంటి వెలుగులు వైభవం కనిపించడం లేదు అదనపు వెలుగుల సంగతి ఎలా ఉన్న అసలు విధి లైట్లే వెలగడం లేదు. వెలుగులతో నింపుతున్న తమకు మాత్రం వేతనాల్లో చీకట్లే మిగిలాయని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ స్ట్రీట్‌లైట్ ఎలక్ట్రీషియన్లు గత నాలుగు రోజులుగా ఆందోళన బాట పట్టారు.
ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నా తమ సేవలకు తగిన గుర్తింపు, వేతనం లభించడం లేదని ఆరోపిస్తూ ధర్నా చౌక్ లో అవుట్ సోర్సింగ్ స్ట్రీట్ లైట్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు సాగుతున్నాయి. నగరంలో విధి లైట్ల సాయంత్రం వేయడం ఉదయం ఆర్పేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగం, అర్బన్ జోన్ల పరిధిలో దాదాపు 20 ఏళ్లుగా ఔట్సోర్సింగ్ ఎలక్ట్రీషియన్లుగా విధులు నిర్వహిస్తున్నారు నగరంలోని వీధిదీపాల నిర్వహణ, మరమ్మతులు, విద్యుత్ సంబంధిత పనులను నిరంతరం వీరే చేస్తారు పేర్కొన్నారు.
ఇంతకాలం పనిచేసినా తమను నాన్-పీహెచ్ కేటగిరీలోనే పరిగణించడం వల్ల తగిన వేతనం అందడం లేదని . ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 60, 63 ప్రకారం ఎలక్ట్రీషియన్ కేటగిరీకి రూ.19,500 వేతనం చెల్లించాలనేది వీరి డిమాండ్ . తమ విధులు, బాధ్యతలు, సాంకేతిక నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకుని వేతనాన్ని సవరించాలని చాల కాలంగా అడుగుతున్నారు .
ఇతర కేటగిరీలకు వర్తించే వేతన విధానాన్ని తమకూ అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు . తమ వద్ద ఎలక్ట్రీషియన్ సర్టిఫికెట్లు ఉన్నాయని, అయినప్పటికీ కార్పొరేషన్ పరిధిలో సర్టిఫికెట్ లేదనే కారణంతో స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు .
నగరంలోని వీధిదీపాల నిర్వహణలో కీలకంగా పనిచేస్తున్నవీరి విషయం లో అధికారులు కార్పొరేషన్ పాలక వర్గం ప్రతినిధులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరించడం తో వారంతా రోడ్డక్కరు.
