ఇందల్వాయి మండల ఉత్తమ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన బొబ్బిలి మధుసూదన్‌ను విశ్వజ్యోతి యువజన గణేష్ మండలి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సత్కరించారు.
బొబ్బిల్లిగల్లిలోని ఇందూరు శ్రీ విశ్వజ్యోతి యువజన గణేష్ మండలి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మధుసూదన్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా 45వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, యువజన సంఘం సభ్యులు, కాలనీవాసులు పాల్గొని మధుసూదన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రస్థాయి గుర్తింపు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
