ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు గణనాథుల ను భక్తులు బారులు తీరారు హైదరాబాద్ లో ఖ్యాతి పొందిన ఖైరతాబాద్ మహా గణపతి ని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. అటు వైపు వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ స్తంభించి పోయింది సెలవురోజు కావడంతో ఇసుకేస్తే రాలనంత జనం మహాగణపతిని దర్శించుకునేందుకు తరలివెళ్తున్నారు.
క్యూలైన్లన్నీ నిండిపోగా.. రోడ్డుపై భక్తులు గుంపులు గుంపులుగా దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనాలు జరుగుతుండటంతో.. ట్యాంక్ బండ్ పరిసరాలు సైతం రద్దీగా మారాయి. బడా గణేష్ ను దర్శించుకున్నవారంతా ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనోత్సవాలను చూసేందుకు ఉత్సాహంగా వెళ్తున్నారు.
దీంతో ఆ ప్రాంతమంతా జనసంద్రాన్ని తలపిస్తోంది.. గణేష్ నవరాత్రి ఉత్సవాలు గురువారంతో ముగియనుండగా.. ఈ ఒక్కరోజే అందరికీ సెలవు కావడంతో వినాయక మండపాల్లో భక్తుల సందడి కనిపిస్తోంది.
