HomeCRIMEకరీంనగర్‌లో దొంగల బీభత్సం ......రెండుఏటియం లు లూటీ....

కరీంనగర్‌లో దొంగల బీభత్సం ……రెండుఏటియం లు లూటీ….

కరీంనగర్ జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు ఒకే రోజు ఏకంగా రెండు యస్ బి ఐ కి చెందిన రెండు ఏటియం లను లూటీ చేసారు కరీం నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్శేడ్, ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్‌లో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలలో ఈ చోరీలు జరిగాయి.

దుర్శేడ్ ఏటీఎంలోకి తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో కారులో వచ్చిన ఇద్దరు దుండగులున్నారు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. ఇందులో ముసుగు వేసుకున్న మహిళా కూడా ఉన్నారు

ఏటీఎంలో వుండే సీసీ కెమెరాలపై స్ప్రే చల్లి, గ్యాస్ కట్టర్‌తో మిషన్‌ను కట్ చేశారు. ఈ ఏటీఎం నుంచి సుమారు రూ.8 లక్షలు అపహరించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. తిమ్మాపూర్ ఏటీఎంలో ఎంత నగదు పోయిందనేది ఇంకా తెలియరాలేదు.ఆదివారం సెలవు కావడంతో బ్యాంకు అధికారులు అందుబాటులో లేరు

దొంగతనానికి పాల్పడినప్పుడు నిందితులు టోపీలు, కళ్లద్దాలు, మాస్కులు, గ్లోవ్‌లు ధరించి తమ గుర్తింపు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. దుర్శేడ్ ఏటీఎంలో చోరీ జరుగుతున్న సమయంలోనే ఎస్‌బీఐ ఢిల్లీ కార్యాలయానికి అలారం వెళ్లింది.

దీంతో వారు స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు.ఈ ఘటనలపై పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో పాటు సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు.

దొంగలు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న స్కార్పియో వాహనాన్ని ఉపయోగించినట్లు గుర్తించారు. ఈ వాహనాన్ని ట్రేస్ చేయడానికి టోల్‌ప్లాజాల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments