ఇంటర్ కాలేజీలకు అనుమతి కోసం నకిలీ ఫైర్ ఎన్ఓసీల డొంక కదులుతుంది.హైడ్రా ఇచ్చిన పిర్యాదు మేరకు లేక్ పోలీసులు ఈ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేస్తుంటే అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి .
మరో 48 కాలేజీలు ఇదే తరహాలో నకిలీ యన్ వోసి లను తయారు చేసి ఇంటర్ బోర్డు కు నివేదించి కాలేజీల అనుమతులు పొంది నట్లుగా సమాచారం . విచారణలో భాగంగా ఒకే తరహాలో నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు తయారు చేసినట్లు గుర్తించారు.
దాదాపు 56 కాలేజీలు నకిలీ ఎన్ఓసీలు సమర్పించినట్లు గుర్తించిన హైడ్రా.. మరో 176 కాలేజీలపై విచారణ జరుపుతోంది. ఐదు అంతస్తులలోపు ఉన్న భవనాల అనుమతుల కోసం ఫైర్ ఎన్‌ఓసీలను హైడ్రా ఇస్తుంది. ఆఫ్‌లైన్‌లో ఎన్వోసీలు మంజూరు చేస్తున్న నేపథ్యంలో కాలేజీ యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఎన్ఓసీల కోసం హైడ్రాకు దరఖాస్తు చేయకుండానే నకిలీలు సృష్టించి ఇంటర్ బోర్డుకు కాలేజీలు సమర్పించినట్లు విచారణలో వెల్లడైంది. ఒక్కొక్క యూనివర్సిటీకి రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలను కాలేజీ యాజమాన్యాలు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. ఎన్‌వోసీల కోసం జీహెచ్ఎంసీ, హైడ్రా, ఫైర్ మాజీ డీజీల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు..
