కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన తండ్రి, అతని ఇద్దరు కుమారులు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పోలీసుల వివరాల ప్రకారం.. తిప్పాపూర్ గ్రామానికి చెందిన కోటిగళ్ల రాజశేఖర్ (36), అతని కుమారులు ఆర్యన్ (12), అయాన్ (8) ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లారు.
అనంతరం వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో రాజశేఖర్ తల్లి కోటిగళ్ల గంగవ్వ భిక్కనూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆమె ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ అనిల్ తెలిపారు. ముగ్గురి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వారి గురించి సమాచారం తెలిసిన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా భిక్కనూర్ పోలీసులను సంప్రదించాలని పోలీసులు కోరారు.
